New Songs Lyrics Telugu

Monday, April 14, 2025

Darsanamey Song Lyrics

Darsanamey Lyrics - Yazin Nizar


శర్వానంద్  "నారీ నారీ నడుమ మురారి" తో మన ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా నుండి దర్శనమే అనే లిరికల్ విడియోని విడుదల చేసారు. ఈ పాట విన్న మొదటి సారే మనకు నచ్చేస్తుంది. విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన సంగీతం సూపర్ గా ఉంది. మంచి మెలోడీ అని చెప్పొచ్చు. సితార్ వాయిద్యం తో మొదలైన ఈ పాట యాజిన్ నిజార్ గొంతులో వినడానికి చాలా బాగుంది. పాటకి తగ్గ పదాలను రామజోగయ్య శాస్త్రి అందించారు. మొత్తం తెలుగు పదాలతో నిండిన పాట ఇది. పాట మొత్తంలో బ్యాక్ గ్రౌండ్  సితార్ వాయిద్యం చాలా బాగుంది. సీతా రామం తరువాత విశాల్ చంద్రశేఖర్ ఇంత మెలోడీ పాట ఇదేనేమో.

ఇందులో శర్వానంద్ ఫ్రెష్ గా కనిపిస్తున్నాడు. చాలా రోజుల తరువాత సంయుక్త మీనన్ తెలుగులో కనబడుతోంది. ఈ విడియో చూస్తె మనకు ఖుషి సినిమాలో ప్రేమంటే సులువు కాదురా పాట లోని పవన్ కళ్యాణ్, భూమిక మధ్య  సన్నివేశం రిపీట్ అయినట్టు అనిపిస్తుంది. నూడుల్స్ తింటుంటే పవన్ కళ్యాణ్ స్పూన్ ని   కావాలని కింద పడేసి భూమిక స్పూన్ తీసుకొని తినేస్తాడు. అదే సీన్ NNNM లో శర్వానంద్, సంయుక్త మధ్య ఉన్నట్టు తెలుస్తోంది. 

   


Nari Nari Naduma Murari













DARSANME SONG DETAILS

Song Name: Darsaname

Movie: Naari Nari Naduma Murari

Cast: Sharwanand, Samyuktha Menon

Music: Vishal Chandrashekhar

Lyrics: Ramajogayya Sastry

Singers: Yazin Nizar

Director: Ram Abbaraju

Producer:  AK Entertainments



Darsanamey Lyrics


దర్శనమే మధుర క్షణమే 
నీవు నేను ఇక మనమే
మనసున మోగే మంగళ నాద స్వరమే 
నాదాక నిన్ను నడిపింది ప్రేమే 
నువ్విల జతగా నడిచే ప్రతి అడుగు పూల వనమే 
నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే 
ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు....
నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే 
ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు....

నీ పెదాలకు మెరుపైన ఎరుపు నేనే 
నీ పదాలకు సిరి సిరి మువ్వనైన  నేనే 
నీ నీలి ముంగురుల ఉయ్యాలలూగానే 
నీ వేలి ఉంగరమై వెయ్యేళ్ళు నావేనే 
నీ చూపు నేనే నీ రేపు నేనే 
నీ యదలో కదిలి  మెదిలే  ఆ సవ్వడైన నేనే 
నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే 
ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు....

రాసి ఇవ్వనా నా నవ్వులన్ని నీకే 
స్వీకరించనా నీ ప్రతి కంటి చెమ్మ నాకే 
నా జంట నువ్వుంటే వెన్నెల మధుమాసం 
నీ తోడు లేకుంటే వేసంగి వనవాసం
నా రామసీత నా ప్రేమ గీత
నువ్విల జతగా నిలిచి నా కలలు  పండెనంట 
దర్శనమే మధుర క్షణమే 
నీవు నేను ఇక మనమే

దర్శనమే మధుర క్షణమే 
నీవు నేను ఇక మనమే
మనసున మోగే మంగళ నాద స్వరమే 
నాదాక నిన్ను నడిపింది ప్రేమే 
నువ్విల జతగా నడిచే ప్రతి అడుగు పూల వనమే 
నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే 
ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు....
నీతో పరిచయమే పరిచయమే ప్రియ వరమే 
ఇక నీతో ప్రతి నిమిషం పరవశమే నాకు....


WATCH  దర్శనమే  LYRICAL VIDEO SONG

No comments:

Post a Comment